50సభ్యులతో ట్రైయిల్ షూట్

0
23

తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలకు పురుడు పోసిన  దర్శకుడుగా ఎస్ ఎస్  రాజమౌళిని పేరు చెప్పుకోవాలి .నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించిన బాహుబలి రెండు చిత్రాలు  ఇప్పటికీ ఒక చరిత్ర .అటువంటి జక్కన్న సినిమాలపై భారీ అంచనాలు ఉండటం సహజం .ఇప్పుడు తన రికార్డులను తానే తిరగరాస్తూ మూడు వందల యాభై  కోట్ల రూపాయలు తో ఆర్ ఆర్ ఆర్ మూవీని నిర్మిస్తున్నాడు. అలాగే ఇప్పటిదాకా ఏ దర్శకుడు కూడా చేయని ఇద్దరు టాప్ హీరోస్ తో ఒక సాహసాన్ని చేస్తున్నాడు .అందులో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ మరొకరు రామ్ చరణ్ వీరిద్దరికీ తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరం గొప్ప నటులు.రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ డైలాగులతో రామ్ చరణ్ విజువల్ తో  వచ్చిన వీడియో ఒక సంచలనం .ఈ వీడియోలో ఇద్దరు టాప్ హీరోల అభిమానులను గుండెలను రాజమౌళి దోచుకున్నాడని చెప్పాలి.

తన మొదటి చిత్రం నుంచి ఇప్పుడు దాకా తను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు సంగీత దర్శకుడిగా ఒక్కరే కావడం విశేషం అతనే ఎమ్.ఎమ్. కీరవాణి.వారిద్దరి కాంబినేషన్ ఎప్పటికీ సక్సెస్ అనే చెప్పాలి .  జనవరి 8 ,2021నాటికి ఈ సినిమా రిలీజ్ తేదీ ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా ఆ తేదీ కి  సినిమా కష్టమే .దాదాపు మూడు నెలల తరువాత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిత్ర పరిశ్రమకు నిబంధన ప్రకారం  చిత్రీకరించడానికి అనుమతులిచ్చాయి.దానితో ట్రైయిల్ షూట్ కోసం రాజమౌళి ప్రణాళిక వేశారు.50సభ్యులతో ఈ ట్రయల్స్ జరుగుతుందని తెలుస్తోంది .ఏది ఏమైనా వచ్చే యేడాదిలో రిలీజయ్యే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ,ఆలియాభట్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here