పెంగ్విన్ మూవీపై రివ్యూ

0
49

Release date : June 19th, 2020

తారాగణం : కీర్తి సురేష్, లింగా,

రచన&దర్శకత్వం : ఈశ్వ‌ర్ కార్తీక్

నిర్మాత : కార్తీక్ సుబ్బ‌రాజు

సంగీతం : సంతోష్ నారాయణన్

తెలుగు సినీ పరిశ్రమలో మహానటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్.నేను శైలజ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత నేను లోకల్ తెలుగు సినీ పరిశ్రమలో తన స్థానం సుస్థిరం చేసుకుంది.పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినా అజ్ఞాతవాసి చిత్రంలో చేసినప్పటికీ ఆ చిత్రం పెద్దగా విజయం సాధించలేదని చెప్పుకోవాలి. పెంగ్విన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ చిత్రం సినిమా థియేటర్లో నిలిచినప్పటికీ OTT ప్లాట్ ఫాంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు .
రివ్యూ :ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక తల్లి పాత్ర పోషించింది . తప్పిపోయిన తన పిల్లవాన్ని ఎవరో కిడ్నాప్ చేశారో తెలుసుకుని తన పిల్లవాడిని ఎలా రక్షించుకుంది అనేది ఈ చిత్ర కథా సారాంశం.
చిత్రం మొదటి నుంచి చివరి వరకు కథ పరంగా ఆసక్తిగా సాగినప్పటికీ ప్రేక్షకులకి కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి.దీనికి కారణం ఏమైనప్పటికీ దర్శకుడుగా కార్తిక్ సుబ్బరాజు తన ప్రతిభను మరోసారి చూపించాడని చెప్పాలి. ఇప్పటికే పిజా ,పేట వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే మహానటి తర్వాత నేషనల్ అవార్డ్ గ్రహీతలుగా మారిన కీర్తి సురేష్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చూపించింది. ఈ చిత్రం కీర్తి సురేష్ కి పెద్ద విజయం కానప్పటికీ తదుపరి చిత్రమైన మిస్ ఇండియా చిత్రంపై ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్ .మహేష్ నటిస్తున్న సర్కార్ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది .అది నిజమో కాదో తెలుసుకోవాలంటే మనం కొన్నాళ్లు వేచి చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here