సోలో బతుకే సో బెటరు అంటున్నసాయి ధర్మ తేజ్

0
22

ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా ఈ డైలాగ్ ఈ హీరో కరెక్టుగా సరిపోతుంది.మెగా ఫ్యామిలీనుండి వచ్చిన ఈ యువ హీరో  తనదైన శైలిలో ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలతో  తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు అతడే సాయి ధర్మ తేజ్ .గత ఏడాది తనకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి .ఎందుకంటే చిత్రలహరి ,ప్రతిరోజూ పండగే లాంటి సూపర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకున్నాడు .ఈ ఏడాది SVCC బ్యానర్ పై  బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సోలో బతుకే సో బెటరు సినిమాను ప్రారంభించారు .ఇప్పటికే ఈ సినిమా ఒక్కTheme   వీడియోకు యూట్యూబ్లో మంచి స్పందన వచ్చింది .ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సుబ్బు కి ఇది మొదటి చిత్రం.

కానీ తెలుగులో ఊసరవెల్లి , ఒంగోలు గిత్త వంటి చిత్రాలకు  అసో సైట్ డైరెక్టర్ గా అలాగే డివోపి గా చేసిన అనుభవం ఉంది.ఈ సినిమాకు కథానాయికగా ఇస్మా శంకర్ డిస్కోరాజా లాంటి సినిమాలు చేసి యువతను ఆకట్టుకున్న నబా నటేష్ నటించనుంది. అలాగే ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం వహించనున్నాడు .ఇప్పటికే నొ పెళ్లి అనే సాంగ్ యూట్యూబ్లో యువతీ యువకులను బాగా ఆకట్టుకుంది .దీనితో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి .మే మొదటి వారంలో సినిమా రిలీజ్ అవుతుందని  అందరూ అనుకున్న కరోనా కారణంగా సినిమా ఆలస్యం కావచ్చని సినీ వర్గాల అంచనా .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here