సినిమాను బ్రతికించు – నువ్వు బ్రతుకు…..రఘు కుంచె

0
60

నిన్న కొంతమంది మీడియా మిత్రులు , Industry లోని కొంతమందిశ్రేయోభిలాషులు call చేసి ..
రఘు… మీ సినిమా ZEE5 వాళ్ళు కొనేశారు కదా ..ఇంకెందుకు వొదిలెయ్ …పట్టించుకోకు ఇవన్నీ అన్నారు .. ఆలా ఎలా సర్ ?కని , అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ,చదివించి రేప్పొద్దున ఒకింటికి కోడలిగా పంపించాక , ఆ పిల్లకి అక్కడేదన్న కష్టం వొస్తే పట్టించుకోమా sir ? Cinema కూడా బిడ్డ లాంటిదే సర్ ..200 మందికి పైగా ఆ బిడ్డని అలంకరించి పంపితే , ఎవరో వొచ్చి పెంట వేస్తుంటే ,ఊరుకోవాలా సర్ ? … ఒకసారి Krishna Vamsi గారు ఏదో interview లో చెప్తుంటే విన్నా .Analize చెయ్యడం వేరు , Experience చేయడం వేరు .. Experience చెయ్యడానికి Ticket కొని cinema చూసిన ప్రేక్షకులు చెప్తారు బావుందా బాలేదా అని . Analize చేసేవాళ్ళు Critics … అలా చెయ్యాలి అంటే సినిమాకి సంబందించిన విభాగాలమీద ఒక పూర్తి అవగాహన అవసరం అని … నువ్ నా సినిమానో , ఒక సినిమాకి నేను పనిచేసిన పనిమీదో .. నా అర్హతని ప్రశ్నించేటపుడు – నీ అర్హతని నేను ప్రశ్నిస్తే తప్పేంటి ? …నువ్ journalisam చేసావా … , ఏదన్నా channel కో , news paper కో Magazine కో లేదా ఒక సినిమాకో Asst Director గా నైనా కొన్ని years పనిచేసావా ?
కనీసం ఆ విభాగాలకు సంబందించిన books ఐనా చదివావా … No .
Direct గా laptop ఊపుకుంటూ వొచ్చి , విశ్లేషకుడు ఐపోయి ఓ 5,6
సినిమాకి సంబందించిన కొన్ని words …
Lot of flaws in script
Editing must be crispy
Songs week
Loud Background score
Camera focus ni inka better ga cheyyochu
Screenplay should be perfect
Direction Bad
ఐపోయింది Review…హమ్మయ్య
చచ్చింది గొర్రె ..
మళ్ళీ what Next Next …
ఎక్కడ ఎక్కడ … ఇంకో సినిమా ..వొచ్చే వారం దాకా ఆగాలా — చేతులు దురదెక్కిపోతున్నాయే ఎలా ….హబ్బా …🤦
చూడు బాబూ ఆ సినిమా వెనకాల కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయ్ , మెట్టు మెట్టు ఎదిగిన కష్టం ఉంది , జీవితాన్ని సంక నాకించుకుని , ఒక పూట తిని , ఒక పూట పస్తుండి
తిరిగి తిరిగి ఒక్క అవకాశాన్ని సంపాయించుకుంటే అది చివరిదాకా ఉంటుందో లేదో తెలియని బతుకులురా సినిమా వాళ్ళవి ..అలాంటి జీవితాల్ని 5 నిమిషాల్లో మీరు నాశనం చేసేస్తుంటే మేం మూసుకుని కూర్చోవాలా.
దా … Cinema అవగానే ఒక channel కెళ్ళి Debate లో కూర్చుని నువ్ రాసిన ఆ Analization ఏదైతే ఉందో ఆ story writer , Director , other Technicians వొచ్చి నీ ముందు కూర్చుంటారు .. Guide them .. నేర్పించు , Detailed గా explain చెయ్ , నేర్చుకుంటాం ..నేర్చుకోటానికేఉన్నాం ఆ సంస్కారం మాకుంది , ఆ ఓపిక ఉంది .
అంతే కానీ .. నువ్వెవరివో తెలియదు – నీ ఆర్టికల్ కిందో , రివ్వూ కిందో పేరుండదు – నీ phone number ఉండదు — కనీసం Email Id ఉండదు ..చీకటి మాటున కూచుని
ఏదో under cop cinema operation చేస్తూ మా బతుకుల రాతలు రాస్తుంటావ్ .. కదా . అది మేం పట్టించుకోకూడదు – అన్ని మూసుకునికూర్చోవాలి .. పట్టించుకుంటే అదిగో మాకు బడి ఏడుస్తున్నాడు , పెడ బొబ్బలు పెడుతున్నారు … అంటూ reverse Atricals …తర్వాత రకరకాల కక్ష సాధింపు చర్యలు ( నీకు అర్ధం అవ్వుద్దిలే అదేంటో .. Confrence call లో Discuss చేస్తావ్ కదా ..!
Ya ..అదే అదే … చూసుకుందాం మెల్లిగా 👍 kind off )
correcte – ఒప్పుకుంటా
నువ్వంటే మాకు (సినిమా వాళ్ళకి)
చెప్పలేని భయం – solution కోసం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ నాలుగు Meetings పెట్టి మళ్ళీ వొదిలేస్తాం ..ఎందుకంటే ..
0 నుంచి కష్టపడి , కిందా మీదా పడి ఇంకో అవకాశాన్ని సంపాయించుకుంటే , నువ్ పగబట్టి ఎక్కడ మళ్ళా వాడి జీవితాన్ని నాశనం చేస్తావేమో అని భయం .. ఆ భయంతోనే కుమిలి కుమిలి ఏడ్చి ,ఎవరికి మొహం చూపించలేక
Mobile switch off చేసుకొని ,అన్నం సయించక , నిద్రపట్టక .. దొర్లి దొర్లి
మళ్ళీ మర్నాటి నుంచి ‘బుర్ర ‘చేత్తో పట్టుకుని తిరిగే జీవితాలు భయ్యా ఇవి …ఆడుకోకండి భయ్యా
మా బతుకులతో … వీలైతే 4 రోజులు బతికించడానికి ప్రయత్నించండి …
లేదా 4 రోజులు బ్రతికే ఆఖరి అవకాశం ఇవ్వండి ..
ఎందుకంటే నువ్వు నిజంగా సినిమాకి సంబందించినతవరకు
శక్తిమంతుడివి భయ్యా … నీ రాతల్ని గుడ్డిగా నమ్మి cinema కి వెళ్లకుండా ఆగిపోయే రోజులే భయ్యా ఇంకా …ఆఖరికి OTT ని కూడా వొదలరా భయ్యా .. Tv serials ,Short films వాటిని కూడా ఎసెయ్యండి భయ్యా .. ఒక పని ఐపోద్ది … ఈ corona లాంటి ఉపద్రవాల వల్ల ఈ థియేటర్లు సంక నాకిపోతే .. అప్పుడు వీటి సంగతి చూసెయ్యొచ్చు … ఎందుకంటే “content ” కావాలి కదా
మీ బండి నడవడానికి .
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ..
సినిమా ఉంటేనే నువ్వు -నేను
కష్టం వొస్తే నా కంట్లోంచి వొచ్చే కన్నీరే
నీ కంట్లోంచి వొస్తుంది ….
సినిమాని , సినెమావాళ్లని ఏడిపిస్తే –నువ్వు కూడా ఏడ్చే రోజు ఎంతో దూరం లో ఉండదు ….
సినిమాని బ్రతికించు – నువ్వు బ్రతుకు ….
దాన్ని చంపితే – నువ్ కూడా ఛస్తావ్
ఒక సినిమా వాడిగా చెప్తున్నా ..అర్ధం చేసుకో 🙏…
Note – నా పేరు పెట్టే రాసా ఇది, దొంగలా రాయట్లా …..రఘు కుంచే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here