సాయిపల్లవితో ప్రేమలో ఉన్న నాగచైతన్య

0
56

ప్రతి ఒక్కరూ వాళ్ల లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల చిత్రం ల ఉండాలనుకుంటారు. అందులో అబ్బాయి నాగ చైతన్య ల అమ్మాయి సాయి పల్లవి ల ఉంటే ఇంకా బాగుంటుంది.వీళ్ల ముగ్గురు కలయికలో వస్తున్న చిత్రం లవ్ స్టోరీ
ఇప్పటికే రిలీజైన ఏ పిల్ల అనే పాట యూ ట్యూబ్ లో యువతీ యువకులను ఎంతగానో ఆకట్టుకుంది.
శేఖర్ కమ్ముల తీసిన చిత్రాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.ఆనంద్ ,గోదావరి హ్యాపీడేస్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, లీడర్ ,ఫిదా వంటి ఎన్నో మనసుకు హత్తుకునే చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సాయి పల్లకి ఫిదా చిత్రం ఎంతమంచి పేరు తెచ్చిపెట్టింది.మళ్లీ వీరి కలయికతో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రేమకథా చిత్రాలకు నాగ చైతన్య పెట్టింది పేరని చెప్పాలి.తన మొదటి చిత్రం జోస్ అయినప్పటికీ ఏం మాయ చేశావే చిత్రం తనకు మంచి మైలురాయని చెప్పాలి.ఇప్పటికే మజిలీ చిత్రంతో సక్సెస్ లో ఉన్నాడు నాగచైతన్య .పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.కరోనా కారణంగా చిత్ర షూటింగ్ నిలిపివేయడం జరిగింది.ప్రస్తుతం సినిమా షూటింగ్ ప్రారంభానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ సినిమాపై ఎటువంటి విశేషాలు ప్రకటించలేదు చిత్ర బృందం.ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాగచైతన్య తన తదుపరి చిత్రానికి కథ వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here