రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అతడు

0
26

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది హీరోలున్నా ఫ్యామిలీ హీరోగా మనం విక్టరీ వెంకటేష్ మాత్రమే చెప్పగలం.ఎందుకంటే తన సినిమాలు అటు పిల్లలని అటు యువతని అలాగే ఇంట్లో ఉన్న ముసలివాళ్ళు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అతడు .తను చేసిన చివరి ఐదు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలు కావడం విశేషం .ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మసాలా, దృశ్యం, గోపాల గోపాల, గురు .దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మరో రీమేక్ చిత్రానికి సిద్ధమయ్యాడు.తమిళం లో అసురన్ పేరుతో రిలీజైన చిత్రం అక్కడ మంచి పేరు తెచ్చుకుంది.అక్కడ ఆ సినిమాలో కథానాయకిగా ధనుష్ నటించారు.కథానాయికగా మలయాళ నటి మంజువారియర్ నటించింది. దానిని ఇప్పుడు తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి స్పందన వచ్చిందని చెప్పాలి.
ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చివరి చిత్రం బ్రహ్మోత్సవం.ఆ చిత్రం అటు మహేష్ బాబు అభిమానులను అలాగే సినీ పరిశ్రమకు నిరాశే మిగిల్చిన చెప్పాలి.ఇదివరకే వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమలె చెట్టు సినిమాతో మంచి హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ నారప్ప సినిమాతో దాన్ని రిపీట్ చేయాలనుకున్నాడు.ఈ చిత్రంలో కథానాయిక ప్రియమణి నటిస్తుంది.తన పాత్ర నారప్ప భార్యగా ఉంటుందని తెలుస్తుంది సి క్రియేషన్స్ అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రకాష్ రాజు ‘మురళి శర్మ ,సంపత్ రాజు,రాజీవ్ కనకాల, అజయ్, రావు రమేష్ వంటి నటులు ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here