రవితేజ కి క్రాక్ సినిమా మరో సక్సెస్ కానుందా.

0
19

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ మహారాజా రవితేజ ఎన్నో పవర్ ఫుల్ టైటిల్స్ తో సినిమాలు చేయడం జరిగింది .తన సినిమాలోనే కాదు తన టైటిల్లో కూడా ఆ మాస్ ని చూపించడానికి ట్రై వేస్తాడు రవితేజ.మిరపకాయ, టచ్ చేసి చూడు , దరువు బెంగాల్ టైగర్, పవర్, నేల టికెట్ ఇప్పుడు మరో కొత్త టైటిల్ తో మన ముందుకు వచ్చాడు.ఆ సినిమా పేరే క్రాక్ . మాస్ మహారాజా రవితేజ కి క్రాక్ సినిమా మరో సక్సెస్ కానుందా….ట్రైలర్ చూస్తే నిజమే అనిపిస్తుంది.

ఇప్పటికే రవితేజకు డాన్ శీను, బలుపు లాంటి  రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన  గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.కానీ ట్రైలర్ చూసిన చాలామంది సినిమా ప్రేక్షకులు  ఇది ఒక రీమేక్ సినిమాగా అభివర్ణించడం జరిగింది. కానీ డైరెక్టర్ గోపీచంద్  మలినేని ఇది రీమేక్ చిత్రం కాదు.  ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన  సినిమా అంటూ సినిమా పోస్టర్ పైనే వేశారు.దీనితో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి .గోపీచంద్  చిత్రాల్లో కొన్ని ప్రత్యేకతను మనం  గుర్తించవచ్చు .తన సినిమాల్లో ఒక ఎంటర్ టైన్మెంట్  అలాగే యాక్షన్ అలాగే కథ కూడా చాలా బలంగా ఉంటుంది .దానికి కారణం లేకపోలేదు .తను సినీ పరిశ్రమలో చాలా మంది డైరెక్టర్లుగా అసిస్టెంట్ డైరక్టర్గా  చెయ్యడం జరిగింది .

అందులో ముఖ్యంగా కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అయిన వివివి సత్యనారాయణ గారు, అలాగే  యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శీను ,కథనే బలంగా నమ్ముకుని ఎన్నో సినిమాలు తీసిన మురగదాస్. అందుకే గోపీచంద్ మలినేని  చిత్రాల్లో అన్ని బలంగా ఉంటాయి .అందుకే తన చిత్రాలు రవితేజకు సరిపోతాయి.ఇప్పటికే  రెండు  సూపర్ హిట్లు కొట్టిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ సిద్ధమయింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here