మరో మాస్ సినిమాతో వస్తున్న రామ్

0
32

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనర్జిటిక్ హీరోగా పేరుపొందిన నటుడు రామ్ పోతినేని.అటు మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రెడ్ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది . కరోనా కారణంగా ఈ చిత్రం రిలీజ్ ఆగిపోయింది .ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ఫాంపై రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నట్టు ఊహాగానాలు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రకటన లేదు .ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు .ఉన్నది ఒకటే జిందగీ ,చిత్రలహరి, నేను శైలజ మంచి చిత్రాలు నిర్మించిన దర్శకుడు.తను తీసిన చిత్రాలు తక్కువయినప్పటికీ ఎక్కువ సినిమాలు రామ్ చేయడం విశేషం.ఈ రెడ్ వీరిద్దరి కలయికలో మూడో చిత్రంగా చెప్పుకోవాలి .ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్ మంచి స్పందన పొందింది.ఈ చిత్రంలో రామ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా యొక్క కథా సారాంశం చెప్పడం జరిగింది. ఈ కథ ఒకే నగరంలో నివసిస్తున్న ఇద్దరు పురుషుల చుట్టూ తిరుగుతుంది. వారిలో ఒకరు ఒక వ్యక్తిపై దాడి చేసి చనిపోతారు, దాని తరువాత దర్యాప్తు ప్రారంభమవుతుంది. ఒక బలమైన సాక్ష్యం పోలీసులను చూసేవారిలో ఒకరిని పట్టుకోవటానికి దారితీస్తుంది. ఏదేమైనా, కేసు మూసివేయబడిందని వారు నమ్ముతున్నట్లే, పోలీసులు కూడా రెండవ రూపాన్ని పట్టుకుంటారు, మరియు ఇప్పుడు ఇద్దరిలో ఎవరు హత్యకు పాల్పడ్డారో తెలుసుకోవాలి.సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.నివేతా పేతురాజ్ ,మాళవిక శర్మ , అమ్రిత.ఈ స్మార్ట్ శంకర్ చిత్రంతో మళ్లీ వెలుగులు వచ్చిన మణిశర్మ .ఈ ఏడాది చాలా చిత్రాలకు సంగీతం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్రవంతి కిషోర్ నిర్మిస్తున్నారు .ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సడలిన తర్వాత చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here