బాలకృష్ణ నటిస్తున్న 106 చిత్రానికి సరికొత్త పేరు

0
22

బాలకృష్ణ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే మొదటిగా మనకు గుర్తువచ్చే డైరెక్టర్ బి.గోపాల్ . బాలకృష్ణతో సమరసింహారెడ్డి ,నరసింహ నాయుడు  లాంటి సూపర్ హిట్  సినిమాలు తీసి బాలకృష్ణను తెలుగు సినీ పరిశ్రమలో మొదట స్థానంలో నిలబెట్టారు. మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేసింది బోయపాటి శీను. వీరిద్దరి  కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈ కాంబినేషన్లో ఇప్పుడు మరో చిత్రం రానుంది.మొన్న బాలకృష్ణ 60వ  పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పటికే  యూ ట్యూబ్ లో ట్రెండింగ్ మారింది . ఆ ట్రైలర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి రెండు సూపర్ హిట్స్  కొట్టిన బోయపాటి మరో మరో హిట్టుకు సిద్ధమయ్యాడని చెప్పాలి .#BB3 First Roar  ట్రైలర్లు రిలీజ్ చేసినప్పటికీ సినిమా పేర్లు మాత్రం ప్రకటించలేదు .బాలకృష్ణ నటిస్తున్న 106  చిత్రానికి ఒక సరికొత్త పేరును పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .ఈ చిత్రంలో హీరోయిన్లుగా అంజలి, శ్రేయ శరన్ నటిస్తున్నారు.శ్రేయ శరన్ ఇప్పటికే బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి,పైసా వసూలు  చిత్రాలు చేయడం జరిగింది.అలాగే అంజలి కూడా ఇది బాలకృష్ణతో రెండో చిత్రంగా చెప్పాలి. డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ సరసన  చేసిన విషయం మనకు తెలిసిందే .ఈ చిత్రాన్ని ద్వారా క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది ఇప్పటికే బోయపాటితో జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా తమన్  పనిచేయడం  ప్రత్యేకంగా చెప్పుకోవాలి .ఈ ఏడాది వచ్చిన అలా వైకుంఠపురం మూవీ సక్సెస్ తో  తెలుగు సినీ పరిశ్రమలో టాప్ సంగీత దర్శకుడు గా మారాడని చెప్పాలి . దీనితో పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here