నా చిత్రం ఎవరినీ బాధించదు – రామ్ గోపాల్ వర్మ

0
57

సినీ పరిశ్రమలో అతడు ఏం చేసినా అదో సంచలనం .అతను చేసిన తర్వాత ఆ సినిమా తప్పకుండా వివాదంలో ఉంటుంది .అతడే రామ్ గోపాల్ వర్మ.రక్త చరిత్ర ,వంగవీటి,అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి ఎన్నో నిజ జీవిత ఆధారంగా తీసిన చిత్రాలు సినీ పరిశ్రమలో ఒక సంచలనంగా మారాయని చెప్పాలి .ఫాదర్స్డే సందర్భంగా అతడు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.అమృత తండ్రి మారుతీ రావుకు వాళ్ల ప్రేమ ఇష్టం లేదు .దానితో మారుతీరావు ప్రణయ్ ని హత్య చేయించాడు.దీనితో అమృత తన తండ్రిపై కేసు వేసి జైలుకు పంపించింది .బెయిల్ నుండి విడుదలైన మారుతీరావు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు .

ఇప్పుడు ఈ నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ మర్డర్ అనే చిత్రాన్ని తీస్తున్నారు .దీనిపై స్పందించిన అమృత ప్రస్తుతం నేను అని మరిచి ఆనందంగా ఉన్నాను .మళ్లీ వర్మ ఇప్పుడు తీస్తున్న ఈ చిత్రం ద్వారా నేను మరిచిన జ్ఞాపకాలని మళ్లీ గుర్తుచేసిన వారవుతారు అని బాధపడుతుంది .దీనిపై స్పందించిన ఆర్జీవీ ఒక తండ్రి తన కూతురి పై ఎంత ప్రేమ చూపించాడు అమితంగా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని చెప్పారు.ఫాదర్స్డే రోజున ఒక విషాద భరితమైన నాన్న పోస్టర్ను ఆవిష్కరిస్తున్న అంటూ వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు .దీనిపై అమృత స్పందించినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది .ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను.కన్నతండ్రికి దూరమయ్యాను.నా జీవితం తలకిందులైంది డబ్బు పేరు కోసం నువ్వు ఎంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు.ఎన్నో బాధలు అనుభవించిన నాకు ఈబాధ మరీ పెద్దది కాదు అంటూ అమృత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.అయితే అమృత చేసిన వ్యాఖ్యలపై వర్మ తాజాగా స్పందిస్తూ..మొదట నేను రిలీజ్ చేసిన పోస్టర్లో మర్డర్ ఒక నిజజీవిత కథ ఆధారంగా తీస్తున్నది అని స్పష్టంగా చెప్పాను .కానీ నేను తీసేది నిజమని ఎక్కడా చెప్పుకోలేదు.గతంలో కూడా నిజ జీవిత కథల ఆధారంగా నేను తీసిన ఎన్నో కథలను ప్రజలు ఆదరించారు.పరిస్థితులు మాత్రమే మనిషిని చెడ్డగా ప్రవర్తించేలా చేస్తాయి నేను గట్టుగా నమ్ముతాను.బాధ ఎవరిదైనా నేను గౌరవిస్తాను.మర్డర్ సినిమాలో వాళ్ళు ఎదుర్కున్న పరిస్థితుల్ని అలాగే వారు పడిన బాధనే మాత్రమే చూపిస్తాను అని వర్మ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here