కొరటాల శివ సినిమా కు సంగీత దర్శకుడుగా మణిశర్మ

0
25

తెలుగు సినీ పరిశ్రమలో వరుస హిట్లతో వున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. రచయితగా తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు .ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్  లాంటి యువ హీరోలతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు మెగాఫోన్ పట్టాడని  చెప్పాలి .

తన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో అని చెప్పినప్పుడు నుంచి  మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. చిరంజీవి రాజకీయానికి దూరంగా ఉన్నప్పటి నుంచి సినిమాలపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.ఖైదీ 150 అలాగే సైరా నరసింహారెడ్డి ఇప్పుడు నూట యాభై మూడు చిత్రంగా వస్తున్న  సినిమాను కూడా  తన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు .మొన్న జరిగిన ఓ పిట్ట కథ సినిమా ఆడియో లాంచ్ లో మెగాస్టార్ పొరపాటునతన తదుపరి చిత్రం పేరు ఆచార్య అని చెప్పడం జరిగింది.ఇప్పటివరకు కొరటాల శివ తీసిన అన్ని సినిమాల్లోనూ సంగీత దర్శకుడుగా దేవిశ్రీ మాత్రమే ఉండేవాడు.వీరిద్దరికి మంచి కాంబినేషన్ అని చెప్పాలి .కానీ ఈ సినిమాకు తనను తప్పించి మణిశర్మను తీసుకోవడంతో సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ పై అంచనాలు  భారీగా పెరిగాయి.ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం వహించిన మణిశర్మ యువ సంగీత దర్శకుల ధాటిని తట్టుకోలేక పోయాడని చెప్పాలి . పూరి జగన్నాథ్ తీసిన ఎస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ బాస్ ఈజ్ బ్యాక్  అనిపించాడు.చిరంజీవితో మణిశర్మ చాలా సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here