ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నేటికి ఏడాది

0
44

చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ మొదలుపెట్టి ఈరోజు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నానటుడు నవీన్ పొలిశెట్టి.లైఫ్స్ బ్యూటిఫుల్, డి ఫర్ దోపిడీ, నంబర్ వన్ నేనొక్కడినే ,చిత్రాలు చేశాడు. ఏజెంట్స్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఒక చిన్న చిత్రంగా వచ్చి ఒక పెద్ద విజయాన్ని సాధించిందనే చెప్పాలి . ఈ చిత్రంలో హీరో ఒక ఏజెంటుగా పని చేస్తాడు.ఏదైనా ఒక పెద్ద మిస్టరీ కేసు పట్టుకుని దాని ద్వారా పేరు డబ్బు సంపాదించాలనుకునే పాత్ర తనది.ఒక మిస్టరీ కేసులో తనకు తెలీకుండానే ఇరుక్కుపోయి చివరిగా ఆ కేసు నుండి ఎలా బయటపడతాడు. అలాగే ఆ కేసుని ఎలా ఛేదించాడు అనేది కథ.ఎన్నో మలుపులతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఈ రోజుకి ఒక ఏడాది పూర్తి చేసుకుంది . దీని తరువాత నవీన్ నటిస్తున్న తదుపరి చిత్రం జాతి రత్నాలు.ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు . మహానటి చిత్రంతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నాగఅశ్విన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here