అయినను పోయి రావలె హస్తినకు

0
22

తన సినిమాకి కథైనా, కథానాయకుడైన అన్ని తన మాటలే ,దీనితో మీకు అర్థమయ్యే ఉండాలి తనెవరో తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు అందరికీ తనొక  గురూజీ. అతనే త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఈ ఏడాది అలా వైకుంఠపురం సినిమాతో బోణీ కొట్టిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమాను ప్రకటించారు .ఇదివరకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్  అయినా సినిమా అరవింద్ సమేత !ఈ మార్కును మరోసారి రిపీట్ చేయాలనుకుంటుంది ఈ కాంబినేషన్ .

ప్రస్తుతం RRR షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన షెడ్యూల్ కంప్లీట్ అవగానే త్రివిక్రమ్ సినిమాలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై ఒక ప్రచారం జరుగుతుంది .అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు నిర్మాతలుగా ఎస్ రాధాకృష్ణ ,నందమూరి కళ్యాణ్ రావు వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి రోజుకు సిద్ధం చేస్తుంది చిత్ర యూనిట్ .ఈ చిత్రంలో కథానాయికగా ఎవరనేది చిత్ర యూనిట్  ప్రకటించినప్పటికీ సోషల్  మీడియాలో రష్మిక మందాన, అక్కినేని సమంత, పూజా హెగ్డే వంటి అగ్ర కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి .సమంత ,పూజా హెగ్దే ఈ ఇద్దరూ  కథానాయిక తో అటు దర్శకుడు త్రివిక్రమ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంతకు ముందే సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే ,ఒకవేళ రష్మికకు  ఈ సినిమాలో అవకాశం వస్తే మీ ముగ్గురి కి  సరికొత్త కాంబినేషన్ అవుతుంది .సినిమాకి సంగీత దర్శకుడు అలాగే ఇతర విభాగాల గురించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here